Jignasa

సరిగ్గా మాతృభాషపైనే పట్టు దొరకని 14 ఏళ్ల వయసులో ఆ కుర్రాడు మూడు భాషలపై మనసు పెట్టారు

తండ్రినే గురువుగా చేసుకుని అందులో ప్రావీణ్యం సంపాదించడం మొదలెట్టారు. రాత, వ్యాకరణ దోషాలను పరిష్కరించడం అప్పుడే అలవాటైంది. ఆ అనుభవమే ఆయనకు 24 భాషలతో విశేష పరిజ్ఞానాన్ని కల్పించింది. మసకబారిన తెలుగుభాషకు పునర్జీవనం కల్పించేందుకు అంకురార్పణ జరిగింది. ఆయన ఎవరో కాదు తెలుగుకు వెలుగునిచ్చిన సూర్యుడు ఛార్లెస్ ఫిలిఫ్ బ్రౌన్….సి. పి. బ్రౌన్ 1798 నవంబర్ 10న కలకత్తాలో జన్మించాడు.బ్రౌనే లేకుంటే.. మన తెలుగు సాహిత్యం మరొక వందేళ్లు వెనకబడి ఉండేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే పరిష్కరించి ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా బ్రౌన్ ను పరిగణిస్తారు. మిగతా ముగ్గురి పేర్లు ఆర్థర్ కాటన్, కాలిన్ మెకెంజి, థామస్ మన్రోలు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు.

ఉద్యోగ బాధ్యతలు, సారస్వత వ్యాసంగంతో ఆయన తీరికలేని స్థితిలో ఉన్నా కడపలో రెండు, మచిలీపట్నంలో రెండు, మద్రాసులో ఒకటి పేద విద్యార్థుల కోసం ధర్మ పాఠశాలలు ఏర్పాటు చేశారు.

 నిరుపేదలు, అనాథలు, వృద్ధులకు ధర్మ టిక్కెట్ల పేరుతో ఉచిత భోజన సౌకర్యం కల్పించి పూటకూళ్ల సత్రాలకు బిల్లు తానే చెల్లించారు.

బ్రౌన్ ఆంగ్లేయుడు. ఇండియాలో పుట్టారు. అవివాహితునిగా ఉండి పోయారు... 1828లోపాతకడపలో సతీసహగమనం జరగబోతోం దని తహశీల్దార్ ద్వారా తెలుసుకున్నాడు. విచారించే అధికారం లేకపోయినా అడ్డుకున్నారు. దేశంలో అప్పటికీ ఇంకా సతీసహగమన నిరోధక చట్టం రాలేదు.

ఆంధ్రాసాహిత్యాన్ని ప్రజ్వలింపజేసిన బ్రౌన్‌ చిరస్మరణీయుడు. జిల్లాలో తాను నివాసం ఉన్నచోటనే బ్రౌన్‌ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం విశేషం.