Jignasa

దేశంలో విద్య అభివృద్ధికి తొలి బాట వేసిన విద్యాధికుడు అబుల్ కలాం ఆజాదే.

ఆయన భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా పని చేశాడు.ఈరోజు నవంబర్ 11 1888 న ఆయన జన్మదినం సందర్భంగా మన దేశంలో జాతీయ విద్యా దినోత్సవంగా పాటిస్తారు.

సత్యం, ధర్మం, త్యాగం, చైతన్యం విలువలతో కూడిన అది బలీయమైన ఉక్కు సంకల్పమై నిలుస్తుంది. ఎందరో త్యాగధనులు స్వాతంత్ర్య సమరంలో బ్రిటిష్ వారికి ఎదురొడ్డి నిలబడ్డారు. వారిలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒకరు. ఆయన పోరాట పటిమ ఎనలేనిది. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని అరెస్టులకు సైతం వెనుకాడని ధీరత్వం తనది. ఆయన దార్శినీయకత శ్లాఘనీయం. భారతదేశం నుండి పాకిస్థాన్ విడిపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం ఆయన దూరదృష్టికి నిదర్శనం. ఆయన లౌకికతత్వం అనుసరణీయం. అలాంటి ఉత్తమ భావాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవడం ఇప్పుడు అత్యావశ్యకం.

మౌలానా ఆజాద్ గొప్ప విద్యావేత్త. విద్య వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని భావించిన దార్శనికుడు, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టారు. అవి ఇప్పటికి అనుసరించదగ్గవే. అప్పట్లోనే స్త్రీ విద్యకు అత్యంత ప్రాధాన్యత నిచ్చారు. విద్యా శాఖకు బడ్జెట్ పెంచడం అనేది భావి భారతాన్ని అత్యున్నత స్థాయికి చేర్చడమే అవుతుంది. ఆయన కవి, రచయిత, మానవతావాది, అత్యున్నత లౌకిక భావాలు గల వ్యక్తి అకళంక దేశభక్తులు. ఒక ఉత్తమ వ్యక్తికి ఉండవలసిన అన్ని లక్షణాలు గల మౌలానా అబుల్ కలాం ఆజాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఉత్తమ దృష్ట స్పష్ట.